బిగ్‌బాస్ 7 టైటిల్ ప్రోమో రాకతోనే సోషల్ మీడియాలో సందడి మొదలైపోయింది. బిగ్‌బాస్ వచ్చేస్తున్నాడోచ్ అంటూ బుల్లితెర ప్రేక్షకులు సంబరపడుతున్నారు. ఎక్కువసార్లు బిగ్‌బాస్ సెప్టెంబర్ మొదటి వారంలోనే ప్రారంభమైంది. అయితే ఈ సారి మాత్రం అప్పటివరకు ఆగేదే లేదంటూ ప్రీపోన్ అవుతోందట! అంటే ఆగస్టు నెలలోనే బిగ్‌బాస్ 7 షురూ అయిపోనుందని వార్తలు వినిపిస్తున్నాయి. జూలై నెలాఖరు లేదా ఆగస్టు ప్రారంభంలో షో స్టార్ట్ చేసి సడన్ సర్‌ప్రైజ్ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు! ఇప్పటికే ప్రోమో షూట్ కూడా పూర్తవగా, కంటెస్టెంట్ల ఎంపిక ఫైనలైపోయిన వెంటనే బిగ్‌బాస్ 7 గ్రాండ్‌గా లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఇక ఈ షో కోసం బ్యాంకాక్ పిల్ల శ్రావణి.. థాయ్‌లాండ్ నుంచి ఇండియాకు వచ్చేసింది. బిగ్‌బాస్ కోసమే ఆమె ఇక్కడికి వచ్చిందన్నది నెటిజన్ల అభిప్రాయం. ఈమె పేరు కచ్చితంగా లిస్ట్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ జాబితాలో ప్రముఖంగా వినిపిస్తున్న మరో పేరు బుల్లితెర ప్రభాకర్. టీవీలో ప్రసారమయ్యే ఎన్నో సీరియల్స్‌లో ప్రభాకర్ నటించాడు. వెండితెరపై కొన్ని చిత్రాల్లోనూ మెరిశాడు. 25 ఏళ్లుగా అతడు టాప్ నటుడిగా ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు. ఇతడిని అభిమానులు ప్రభాకర్‌ను బుల్లితెర మెగాస్టార్ అని పిలుచుకుంటారు. ఇతడుగానీ హౌస్‌లో అడుగుపెడితే రచ్చ రచ్చే అంటున్నారు ఫ్యాన్స్.
ఒకవేళ ప్రభాకర్ నో చెప్తే తన స్థానంలో అతడి కొడుకు చంద్రహాస్ వచ్చినా ఓకే అంటున్నారు. చంద్రహాస్ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు ఇప్పటికే రెడీ అయిన సంగతి తెలిసిందే! ఇతడి టాలెంట్ చూసి మొదటి సినిమా రిలీజ్ అవ్వకముందే మరో రెండు సినిమాల ఆఫర్ వచ్చాయని చెప్పాడు. ఇకపోతే తొలి చిత్రం ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో చంద్రహాస్ ప్రవర్తన చూసిన జనాలు అతడికి ఆటిట్యూడ్ స్టార్ అన్న ట్యాగ్ కట్టబెట్టారు. ఇతగాడు కానీ వస్తే మీమర్స్‌కు కావాల్సినంత కంటెంట్ దొరకడం ఖాయం! మరి ఈ తండ్రీకొడుకుల్లో ఎవరైనా ఒకరు వస్తారా? లేదా? అనేది చూడాలి!
చదవండి: ఆ హీరో ఇంటికి రమ్మన్నాడు.. వెళ్లకుండా తప్పు చేశా: హీరోయిన్
ఆదిపురుష్ కంటే చంద్రయాన్ 3 బడ్జెట్ తక్కువే!