అయితే ఆరోగ్యం మరింత క్షీణించడంతో గురువారం ఉదయం 2: 30 నిమిషాలకు విష్ణువర్దన్ రెడ్డి మృతి చెందాడు. అతడి మరణంతో పటాన్చెరు నియోజకవర్గవ్యాప్తంగా విషాదఛాయలు అలుముకున్నాయి. కొడుకు మరణంతో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో విషాదం నెలకొంది. విష్ణువర్దన్ రెడ్డి మృతికి పలువురు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు సంతాపం ప్రకటిస్తున్నారు. కొడుకు మృతితో బాధలో ఉన్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిని బీఆర్ఎస్ శ్రేణులు పరామర్శించి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నారు.
గుండెపోటుతో విష్ణువర్దన్ రెడ్డి మృతి చెందినట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో తండ్రితో కలిసి రాజకీయ కార్యక్రమాల్లో అతడు చురుగ్గా పాల్గొనేవాడు. ఎన్నికల సమయంలో తండ్రి తరపున ప్రచారం నిర్వహించేవాడు. దీంతో నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలతో అతడికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకుంటున్నాడు.
కాగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. 2014, 2018 ఎన్నికల్లో రెండుసార్లు పటాన్చెర్వు నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. వచ్చే ఎన్నికల్లో కూడా మరోసారి పోటీలోకి దిగేందుకు రెడీ అవుతున్నారు.
విష్ణువర్ధన్ రెడ్డి పార్థీవదేహాన్ని మంత్రి హరీశ్ రావు సందర్శించి నివాళులర్పించారు. అతడి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. అనంతరం విషాదంలో మునిగిపోయిన మహిపాల్ రెడ్డి, కుటుంబసభ్యులను హరీశ్ రావు ఓదార్చారు.